ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (IPASE) మరియు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన వెలువడింది.
రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన సుమారు 12.50 లక్షల జవాబుపత్రాల మూల్యాంకన (వ్యాల్యుయేషన్) ప్రక్రియ జూన్ 15వ తేదీనే విజయవంతంగా ముగిసింది.
ఫలితాలు విడుదలైన వెంటనే, విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ [https://bie.ap.gov.in/](https://bie.ap.gov.in/) లో తమ మార్కులను చూసుకోవచ్చు.