AP Inter Supplementary Results 2026 విడుదల రేపే, ఎన్నిగంటలకు అంటే…

teacherforum

June 17, 2026

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (IPASE) మరియు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన వెలువడింది.

రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన సుమారు 12.50 లక్షల జవాబుపత్రాల మూల్యాంకన (వ్యాల్యుయేషన్) ప్రక్రియ జూన్‌ 15వ తేదీనే విజయవంతంగా ముగిసింది.

ఫలితాలు విడుదలైన వెంటనే, విద్యార్థులు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్ [https://bie.ap.gov.in/](https://bie.ap.gov.in/) లో తమ మార్కులను చూసుకోవచ్చు.